రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలోని ప్రముఖ కవులకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల నగదుతో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా ప్రకటించింది. అయితే.. ఇందులో ప్రముఖ కవి, పాటల రచయిత సుద్ధాల ఆశోక్ తేజ కూడా ఉన్నారు. కాగా.. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సుద్దాల అశోక్ తేజ కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై లండన్‌లోని తెలంగాణ ఎన్నారై స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు.