ఆదర్శ దంపతులు అన్యోన్య దాంపత్యం అంటే ఈ ఇద్దర్నీ చూపిస్తే సరిపోతుంది. ఒక వయస్సు వచ్చాక భార్యకు భర్త తోడు, భర్తకి భార్య తోడు. ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు అని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అనారోగ్యంతో భర్త చనిపోయిన గంటల్లోనే భార్య కూడా ప్రాణాలు విడిచింది. అంబులెన్స్‌లో భర్తను ఇంటికి తీసుకొస్తున్న సమయంలో భార్య కుప్పకూలిపోయి కన్నుమూసింది. ఈ సంఘటనతో వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు టీచర్స్ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.