తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బైక్ డిక్కీలో ఉంచిన 5లక్షల రూపాయల నగదును ఓ దొంగ చాకచక్యంగా దోచేశాడు. లక్ష్మణ చాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగే నరేష్ అనే వ్యక్తి స్థానిక యూనియన్ బ్యాంకు నుంచి ఐదు లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. అంతలోనే తనకు ఫోన్ రావడంతో అల్లుడు కళ్యాణ్‌కి డబ్బులిచ్చి ఇచ్చి బైక్ డిక్కిలో పెట్టి అక్కడే ఉండమన్నాడు.. ఆ డబ్బును డిక్కీలో పెట్టి కాసేటి అక్కడే కూర్చున్న కళ్యాణ్ తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకి వెళ్లాడు. ఆ తతంగాన్ని గమనిస్తూ ఉన్న ఓ దొంగ దొరికించే ఛాన్స్ అనుకుని డిక్కీలో ఉంచిన నగదును దర్జాగా తీసుకుని పరారయ్యాడు. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన కళ్యాణ్ డిక్కీ తెరిచి ఉండటాన్ని గమనించి చూడగా నగదు కనిపించలేదు. దీంతో వెంటనే తన మామ నరేష్‌కు చెప్పగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిక్కీలో నుంచి దొంగతనం చేస్తోన్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.