TGSRTC MD Sajjanar: ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలూ, ఇన్‌స్టాగ్రాం రీల్స్‌దే హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరు ఒక్కో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోతున్నారు. తప్పేమీ లేదు. కానీ.. వాళ్లు వాళ్లకు వచ్చే వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఓకే. కానీ.. రాకాసి బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసుకుంటూ.. అమాయకమైన యువతను ఆ కూపంలోకి లాగుతూ.. జీవితాలను నాశనమయ్యేందుకు కారణమవుతున్నారు. ఇలాంటి వాటిపై నిత్యం స్పందించే టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో పోస్ట్ చేశారు.