హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 400 ఎకరాల స్థలం తమదేనని వెల్లడించిన ప్రభుత్వం.. ఆ స్థలాన్ని చదును చేసి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. వటా ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ స్థలాన్ని అటవీ ప్రాంతంగా గుర్తించి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రేవంత్ రెడ్డి సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.