చెత్త నుంచి సంపద సృష్టించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లు నెలకొల్పాలని భావిస్తోంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు. త్వరలోనే కాకినాడ, నెల్లూరులో ఈ తరహా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మూడేళ్లలోగా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్న నారాయణ.. అమరావతి ప్రాజెక్టు పూర్తికి రూ.62 వేలకోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే 45 వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ అనుమతి ఇచ్చిందన్నారు.