Hydra: చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే హైడ్రా టాస్క్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టివాళ్లు.. ఎంత పెద్ద వాళ్లున్నా, వదిలిపేట్టే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. అలాంటి వాళ్లను అవసరమైతే జైలుకు కూడా పంపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. చెరువుల్లో పేదల ఇళ్లను తొలగించి, వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు.