చెరువులో శవాలు.. తాళ్లతో బైక్‌కు కట్టి.. అసలేం జరిగింది?

2 hours ago 1
కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కృత్తివెన్ను మండలంలోని చిన్నగొల్లపాలెం చెరువులో రెండు మృతదేహాలను గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో బైక్‌కు తాళ్లతో కట్టిన రెండు మృతదేహాలను స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామస్థుల సాయంతో మృతదేహాలను వెలికి తీశారు. మృతులను శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ మామ అల్లుడు అవుతారని, శనివారం నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article