తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్లు అయ్యాయి. రాష్ట్ర పోలీస్ శాఖలో ఒకేసారి 12 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఈ క్రమంలోనే వరంగల్ కొత్త సీపీగా ఎన్ శ్వేతను నియమించారు. ఈ క్రమంలోనే సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో కీలక అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. మరోవైపు.. జోనల్ డీఐజీలకు అదనపు బాధ్యతలు కల్పించారు. ఇక ఒకేసారి 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.