తెలంగాణ ప్రభుత్వం ఈహెచ్ఎస్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం లేదా మూల పింఛనులో 1.5 శాతాన్ని కట్ చేయనుంది. ఈ మొత్తాన్ని ఈహెచ్‌ఎస్ నిధికి మళ్లించనుంది. మే నెల జీతాలు, పెన్షన్ల నుంచే ఇది అమల్లోకి రానుంది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైనా లేదా ఉద్యోగి, పెన్షనర్ అయినా ఒక్కరి నుంచే ఈ కోత విధించనున్నారు. పొరపాటున ఇద్దరికీ కట్ అయితే రీఫండ్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.