యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది. కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు యువకులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. యువకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో కారులో మెుత్తం ఆరుగురు ఉండగా.. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.