మంగళగిరిలో కలకలం రేపిన ఐదు కేజీల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆరు రోజుల్లోనే అసలు నిందితులను గుర్తించారు. బాధితుడే అసలు సూత్రధారిగా పోలీసులు తేల్చారు, ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మంగళగిరి మండలం ఆత్మకూరు బైపాస్‌లోని అండర్ పాస్ వద్ద స్కూటీని అటకాయించి నాలుగు కోట్ల రూపాయల విలువైన 5 కేజీల బంగారం దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. యజమానికి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. చేరీ చేసింది ఎవరనేదీ గుర్తించారు.