సంచలనం సృష్టించిన సూర్యాపేట హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వడ్లకొండ కృష్ణ హత్య కేసుపై ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. జనవరి 26న కృష్ణ హత్య జరిగిందని తెలిపారు. కృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారని తెలిపారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే హత్య జరిగింది. ఏ1 కోట్ల నవీన్, ఏ2 బైరు మహేష్, ఏ3 కోట్ల సైదులు, ఏ4 కోట్ల వంశీ, ఏ5 కోట్ల భిక్షమమ్మ/ బుచ్చమ్మ ఏ6 నువ్వుల సాయి చరణ్‌లను చేరుస్తూ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.