చేనేత వస్త్రాలు కొనుగోలు చేసేవారికి శుభవార్త. చేనేత వస్త్రాలను 50 శాతం రాయితీ మీద విక్రయించనున్నారు. సచివాలయం వద్ద ప్రత్యేక చేనేత కౌంటర్లు ఏర్పాటు చేశారు. మంత్రి సవిత ఈ కౌంటర్లను బుధవారం ప్రారంభించారు. సచివాలయంలోని మహిళా ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు వీటిని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మార్చి పదో తేదీ వరకూ ఈ స్టాళ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు.