రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కంకర లోడుతో వచ్చిన లారీ బస్సును ఢీకొట్టడంతో బస్సు సగం నుజ్జునుజ్జు అయింది. తల్లి ఒడిలో ఉన్న 15 నెలల పసికందుతో సహా పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదంలో బలైపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.