రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన 19 మంది బాధితుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆర్టీసీ తరపున అదనంగా రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 7 లక్షలు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు.