రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ప్రియుడి మోజలో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత ఏం తెలియనట్లు సినీఫక్కీలో డ్రామా మెుదలుపెట్టింది. మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.