యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైతాపురం వద్ద ఓ స్కార్పియో డివైడర్‌ను ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు మృతి చెందారు. ఏఎస్పీ కేవీఎస్ ప్రసాద్, డ్రైవర్ నర్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.