సాధారణంగా మనం బస్సుల్లో దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు లగ్జరీ బస్సుల్లోనో, స్లీపర్ బస్సుల్లోనో, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనో.. వాటర్ బాటిల్స్ ఇస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తున్న ఓ ప్రయాణికుడు.. ఆ బస్సు డ్రైవర్ చేసిన ఓ పనిని వీడియో తీయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తుంటే.. ఛీ ఛీ యాక్ అనటం పక్కా. బస్సుల్లో వాటర్ బాటిల్ తీసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.