వన్యప్రాణి ప్రేమికులకు తెలంగాణ ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది. పులులు, ఇతర వన్యప్రాణులను లెక్కించే కార్యక్రమంలో వాలంటీర్లుగా పాల్గొనేందుకు ఆహ్వానం పలుకుతోంది. నవంబర్ 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2026లో జరగనున్న అఖిల భారత పులుల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నారు. 18-60 ఏళ్ల మధ్య వయస్కులు, శారీరక సామర్థ్యం ఉన్నవారు ఈ సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే సర్వేలో పాల్గొన్నందుకు ఎలాంటి జీతం చెల్లించరు. ఆ వివరాలు..