వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు."వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఏ రాష్ట్రంలోనూ దొరకడు. అను నిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు. కుల, మత, పార్టీలకు అతీతంగా మంచి చేసిన వ్యక్తి. గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చారు. అందుకే వారిని ప్రజలు పట్టించుకోవడం లేదు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని ఈ రోజు జనం భావిస్తున్నారు. అందుకే జగన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఎన్నికలకు ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయింది. జగన్ నాయకత్వంలో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నాము. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా జగన్ ఫ్లెక్సీ, కటౌట్ పెట్టకూడదని చెప్తున్నారంట.. ఇవన్నీ చూస్తుంటే జగనన్నను చూస్తేనే కాదు.. ఆయన కటౌట్ చూసినా కూడా కూటమి ప్రభుత్వం భయపడుతోంది.. అంటూ రోజా విమర్శించారు.