Ys Sharmila Comments On Ys Jagan: ముంబై నటిని కట్టడి చేసేందుకు ఐపీఎస్ అధికారులను రంగంలోకి దించడం దారుణమన్నారు ఏపీ కాంగ్రెస్ చీప్ షర్మల.జగన్‌ను సజ్జన్ జిందాల్ పదేపదే కవలడం చూసి స్టీల్ ఫ్యాక్టరీ పనులు వేగవంతం చేస్తున్నారని అనుకున్నామని.. కానీ ఓ నటిని కట్టడి చేసేందుకు స్కీమ్‌లు వేయడం దారుణమన్నారు. వారి బుర్రలు నటిని వేధించడానికి కాకుండా స్టీల్‌ప్లాంట్‌పై పెట్టి ఉంటే అది ఏనాడో కార్యరూపం దాల్చేది అన్నారు. ఆమెకు అండగా ఉండి పోరాడటానికి తాను సిద్ధమని ప్రకటించారు వైఎస్ షర్మిల.