Lady Constable Selfie With Ys Jagan In GUntur: గుంటూరు జైలు దగ్గర జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.. అదే సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ వచ్చారు.. అందర్ని దాటుకుని దూసుకొచ్చారు. జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆయేషాబా.. 'నేను మీ అభిమానిని.. నన్ను ఆశీర్వదించండి.. ఒక్క సెల్ఫీ అంటూ అడిగారు. జగన్ కూడా ఓకే చెప్పడంతో ఆనందంతో సెల్ఫీ తీసుకున్నారు. అయితే ఆమె ఆ సమయంలో విధుల్లో ఉన్నారు.