వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. పులివెందులకు చెందిన మెహబూబ్ షరీష్ ఏడో తరగతి విద్యార్థి జగన్‌ను కలవడానికి వచ్చాడు. జగన్ పులివెందుల వస్తున్నారని తెలుసుకుని కాళ్లకు చెప్పులు లేకపోయినా.. ఎండలో 5 కిలోమీటర్లు నడిచి వచ్చి హెలిప్యాడ్ దగ్గర జగన్ కోసం ఎదురుచూశాడు. జగన్ పులివెందుల చేరుకున్న వెంటనే హెలిప్యాడ్ వద్ద జగన్‌ను చూసిన షరీఫ్.. ఒక్కసారిగా భావోద్వేగానికి గురై ఏడ్చాడు. అప్పుడు ఏం జరిగిందని జగన్ ఆరాతీశారు.. జగన్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగాలన్న కోరికతో వచ్చినట్లు షరీఫ్ చెప్పాడు. దీంతో షరీఫ్‌ను ఓదార్చి ఫోటో దిగారు జగన్..బాగా చదువుకోవాలని సూచించి ఇంటకి పంపారు.