జగన్‌‌పై కేసు నమోదు.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రోజా

1 year ago 33
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. జగన్ ఎక్కడికి వెళ్లినా జనప్రవాహం సముద్రంలా వస్తోందని, ప్రజల్లో ఇప్పటికే 'ఈవీఎం ప్రభుత్వం' అని చర్చ మొదలైందని ఆమె అన్నారు. జూన్ 18న జరిగిన ఘటనపై ఎస్పీతో అబద్ధం చెప్పించారని, కల్తీ నెయ్యి ఘటనలో ఈవో మాట మార్చారని ఆరోపించారు. సింహాచలం గోడ కూలిన ఘటనలో హోంమంత్రిపై ఎందుకు కేసు పెట్టలేదని, 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాటలతో ఇద్దరు చనిపోతే ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. జగన్ ప్రజల మనిషి అని, కోవిడ్ సమయంలో ప్రాణాలు కాపాడారని గుర్తుచేస్తూ, కూటమి అబద్ధాలతో ఓట్లు వేయించుకుందని రోజా ధ్వజమెత్తారు.
Read Entire Article