AP Food Commission Chairman Vijay Pratap Reddy Security: ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్‌రెడ్డి సెక్యూరిటీపై హైకోర్టు కీలక ఆదేవాలు జారీ చేసింది. ఆయనకు 1 ప్లస్ 1 సెక్యూరిటీని పునరుద్ధరించాలని ఆదేశించింది. ఆయనకు రెండు వారాల్లోగా భద్రతను పునరుద్ధరించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. విజయ్‌ప్రతాప్ రెడ్డి తనకు 1 ప్లస్ 1 సెక్యూరిటీని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ జరిపి తీర్పు ఇచ్చారు.