ఇన్నాళ్లూ జగన్‌మోహన్ రెడ్డిని చూస్తే భయపడ్డారు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుంటుందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. అధికారులను అడ్డం పెట్టుకుని మరీ జగన్ బర్త్ డే వేడుకలను అడ్డుకుంటున్నారన్నారు. తిరుపతి నియోజకవర్గంలో జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో రోజా పాల్గొన్నారు. ఈవీంఎలను మేనేజ్ చేయడం వల్లే కూటమి గెలిచిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై నెల రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్ నాయకత్వంలో ఆయనకు తోడుగా, అండగా ప్రజల పక్షాన పోరాటం చేద్దామన్నారు. అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చిందని.. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తనపై కూటమి నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలపైనా రోజా స్పందించారు. తాను అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. తాను చేసిన తప్పు ఏంటో నిరూపించాలన్నారు. చేసిన తప్పులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు.