జగన్ కంబంధ హస్తాల నుంచి బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు ఉపసభాపతి అయ్యారన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు. మిగతా వారు కూడా సంకెళ్లు తెంచుకొని వస్తే బాగుంటుందని.. జగన్ వైఖరి చూస్తుంటే, ‘ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. కనీసం సీఎం పదవైనా ఇవ్వండ’ని అడిగేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రవర్తన బాధాకరమన్నారు. 80 ఏళ్ల ఉమారెడ్డి వెంకటేశ్వర్లును వెల్‌లోకి వెళ్లాలని సైగ చేయడం జగన్‌కు సిగ్గనిపించలేదా? అని ఘాటుగా స్పందించారు. విశాఖపట్నం నుంచి దుబాయికి విమానం నడిపితే 90% సీట్లు భర్తీ అవుతాయని.. విజయవాడ నుంచి నడపనున్నట్లు తెలిసింది.. రెండు చోట్ల నుంచీ వేయాలి అన్నారు.