జనగామ జిల్లా మాజీ కలెక్టర్ సహా 12 మందిపై కేసు నమోదుకు జిల్లా కోర్టు ఆదేశించింది. చేయని తప్పుకు వీవోఏను సస్పెండ్ చేసినందుకు ఈ మేరకు ఆదేశాలించ్చింది. అకారణంగా వీవోఏపై అవినీతి ఆరోపణలు మోపి.. అధికార దుర్వినియోగానికి పాల్పడి సస్పెండ్ చేసినందుకు ఈ మేరకు కేసు బుక్ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.