West Godavari Zp Chairman Padma Sri Joined TDP: అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల షాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే వైసీపీకి నేతలు వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడగా తాజాగా మరో గట్టి షాకే తగిలింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో అమరావతి చేరుకున్న పద్మశ్రీకి మంత్రి నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.