జనసేనలో చేరికపై తమ్మినేని కీలక వ్యాఖ్యలు

3 weeks ago 3
వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జనసేనలోకి వెళ్తారంటూ గత కొన్నిరోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీరుపై తమ్మినేని అసంతృప్తిగా ఉన్నారని.. జగన్ నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంపై ఆయన మౌనంగా ఉండటంతో మరింత బలచేకూరింది. తాజాగా, ప్రచారంపై తమ్మినేని సీతారాం స్పందించారు. జనసేన పార్టీలోకి వెళ్తున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. తన కుమారుణ్ని ఇటీవల ఆస్పత్రిలో చేర్పించానని.. గత 15 రోజులుగా ఆసుపత్రి దగ్గరే ఉన్నానని తమ్మినేని సీతారాం వెల్లడించారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు.
Read Entire Article