జనసేనలోకి మరో మాజీ ఎమ్మెల్యే.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

7 hours ago 1
జనసేనలోకి మరో మాజీ ఎమ్మె్ల్యే చేరనున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు. సోమవారం కుటుంబంతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు పెండెం దొరబాబు. ఈ సందర్భంగా జనసేనలో చేరాలనే కోరికను బయటపెట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. దీంతో త్వరలోనే పెండెం దొరబాబు జనసేనలో చేరనున్నారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనసేనలో చేరాలని భావిస్తున్నారు దొరబాబు.
Read Entire Article