కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కడప జడ్పీ చైర్మన్ పీఠం విషయంలో తలెత్తిన విభేదాలతో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అవ్వడమే కాకుండా రాత్రికి జరిగే చర్చల తర్వాత ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని అల్టిమేటం కూడా జారీ చేశారు. దీంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డితో పాటు.. జడ్పీటీసీలుగా గెలిచిన ఆయన సోదరుల కుమారులు కూడా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.