తెలంగాణలో భారీ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ రూపుదిద్దుకుంటోంది. జహీరాబాద్‌లో 3,245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ సిటీలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 2028 మార్చి నాటికి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.