హ్యుందాయ్ మోటార్స్ ఇండియా జహీరాబాద్లో భారీ పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. రూ.8,528 కోట్లతో గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 4,276 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే సంస్థ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ప్రాజెక్టు పురోగతిని వివరించింది. తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమను కూడా ఏర్పాటు చేయాలని కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.