పెనుకొండలో పెను విషాదం.. గొల్లపల్లి జలాశయంలో ఐదుగురు మహిళల జలసమాధి

1 hour ago 1
శ్రీ సత్యసాయి జిల్లా గొల్లపల్లి పెనుకొండలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విహార యాత్రకు వెళ్లిన ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. పెనుకొండ పట్టణం దర్గాపేటకు చెందిన కొంతమంది మహిళలు కలసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు అందులో దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో ఐదుగురు మహిళలు మునిగి చనిపోయారు. అయితే అక్కడున్న రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చనిపోయిన వారిలో మహీం, హసీనా, పుష్పలత, గాయత్రమ్మ, అశ్వని ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మంత్రి సవిత స్పందించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
Read Entire Article