సైబర్ మోసగాళ్లు రోజురోజుకూ బరి తెగిస్తున్నారు. లింకుల ద్వారా అకౌంట్లలో డబ్బులు కాజేస్తూ వచ్చిన కేటుగాళ్లు.. ఇప్పుడు రూటుమార్చారు. ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి వాటి ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారమే ఏపీలో చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, బాపట్ల జిల్లా కలెక్టర్ల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. వాటి ద్వారా అధికారులను, ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ఇలాంటి నంబర్లతో జాగ్రత్తంటూ హెచ్చరించారు.