జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేయగా.. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈక్రమంలో పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం భూ కేటాయింపులు రద్దు చేసింది.