తెలంగాణలో ఉద్యోగులకు పదోన్నతుల పర్వం కొనసాగుతోంది. తాజాగా జీహెచ్‌ఎంసీలో 22 మంది సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు 15 రోజుల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.