జూనియర్‌ ఎన్టీఆర్‌పై సరస్వతమ్మ వ్యాఖ్యలు సరికాదు.. ఫ్యాన్స్ కన్వీనర్

4 weeks ago 3
తిరుపతికి చెందిన కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు ఫ్యాన్స్ అసోసియేషన్ కన్వీనర్ కృష్ణ యాదవ్.ఎన్టీఆర్‌ను రోడ్డుకీడ్చడం సరైంది కాదని.. ఎన్టీఆర్ సహాయంతోనే క్యాన్సర్ తో బాధపడే కౌశిక్ కోలుకున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కౌశిక్ వైద్య చికిత్స కోసం లక్షల రూపాయలు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పంపించిన డబ్బుతోనే చెన్నెలో చికిత్స పొందుతున్న కౌశిక్ ను డిశ్చార్జ్ చేయించామన్నారు. కౌశిక్ కోలుకుంటున్నారన్నారు. తమతో సంప్రదించకుండానే సరస్వతమ్మ మీడియా సమావేశం పెట్టారని మురళి అన్నారు. అభిమాని క్యాన్సర్ తో బాధపడటం చూసి ఎన్టీఆర్ చలించిపోయారన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పంపిన డబ్బులతో సరస్వతమ్మ గతంలో తాను చేసిన అప్పులను కట్టుకుందన్నారు.
Read Entire Article