రాజకీయ విశ్లేషకుడు కౌటిల్య కృష్ణుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సంచలన అంచనాను ప్రకటించారు. గతంలో ఏపీ ఎన్నికల్లో ఆయన వైసీపీ ఘన విజయాన్ని కచ్చితంగా అంచనా వేసి విశ్వసనీయత పెంచుకున్నారు. అయితే.. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు 55 శాతం ఓట్లు వస్తాయని.. కాంగ్రెస్‌కు 37 శాతం మాత్రమే వస్తాయని కేకే తేల్చారు. మజ్లిస్ మద్దతు, అధికార పార్టీ బలం వంటి అంశాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నా.. బీఆర్ఎస్‌కు అసాధారణ మెజారిటీని అంచనా వేయడం రిస్క్‌తో కూడుకున్నదిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.