జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎక్కడికక్కడ తనిఖీలు.. భారీగా నగదు, లిక్కర్ సీజ్..

9 months ago 21
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు కఠినతరం చేశారు. ఇప్పటివరకు రూ.3.3 కోట్ల నగదు, 701 లీటర్ల మద్యం, రూ.4.74 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం అయ్యాయి. అలాగే 2 కిలోల గంజాయి, MDMA డ్రగ్‌ కూడా పట్టుబడింది. ఇప్పటివరకు 24 కేసులు నమోదు కాగా.. 45 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 45 సర్వైలెన్స్ బృందాలు కంట్రోల్ రూమ్‌ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. కాంగ్రెస్‌ నుంచి నవీన్ యాదవ్ (Naveen Yadav), బీఆర్ఎస్‌ నుంచి మాగంటి సునీత , బీజేపీ నుంచి లంకల దీపక్‌ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
Read Entire Article