జూబ్లీహిల్స్ ఓటమితో.. బీఆర్ఎస్‌కు పట్ట పగలే చుక్కలు కనపడుతున్నాయి: మంత్రి శ్రీధర్ బాబు

3 months ago 6
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఆర్థిక ఆరాచకానికి పాల్పడిందని ఆరోపించారు. లీజ్ భూములను ఫ్రీహోల్డ్‌గా మార్చే విధానంపై కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని.. ఇది కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమేనని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. ఇదే విషయంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని.. కేటీఆర్ పరిస్థితి అదేనని విమర్శించారు. కేటీఆర్ వ్యాపారవేత్తలను బెదిరించడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
Read Entire Article