జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ చివరి ఘట్టంలో ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదం జరగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలింగ్ ముగియగానే పలు సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వెల్లడించాయి. తుది ఫలితం నవంబర్ 14న వెల్లడి కానుంది.