శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, జేసీ కుటుంబంతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఫోటోలను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వృద్ధాప్య సమస్యలతో జేసీ దివాకర్ రెడ్డి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.