విశాఖపట్నంలో ఓ చర్చిలో 11 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. గాలి సోకిందని బాలిక తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకెళ్లగా అక్కడ విషాదం చోటుచేసుకుంది. బాలిక నోట్లో గుడ్లు కుక్కి చున్నీతో మూతికి కట్టేయడంతో ఊపిరాడక చనిపోయిందని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ ఏమిటంటే, ఆ తరువాత తల్లి, అమ్మమ్మ కూడా బావిలో శవాలై తేలారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు.