ఒకప్పుడు పచ్చబొట్టు వేయించుకునే వారు చాలా మంది కనిపించారు. అది కాస్త ఇప్పుడు టాటూలుగా రూపాంతరం చెందింది. గ్రామం, పట్టణం.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ టాటూలు వేయించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. ఇతరల కంటే తాము ప్రత్యేకంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో కొందరు ఇలా తమకు ఇష్టమైన వారి పేరు లేదా ఫొటోలను టాటూగా వేయించుకుంటున్నారు. ఇంకొంత మంది తమకు ఇష్టమైన దేవుళ్ల బొమ్మలను వేయించుకుంటున్నారు. వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.