Drinker Sai movie: టాలీవుడ్ దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్‌పై ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు అభిమానులు దాడి చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. డ్రింకర్ సాయి సినిమాలో డైరెక్టర్ కిరణ్.. మంతెన సత్యనారాయణను కించపరిచే విధంగా సన్నివేశాలు తీశారని.. ఆగ్రహించిన ఆయన అభిమానులు దర్శకుడిపై దాడి చేశారని వార్తలు వ్యాప్తి చెందాయి. దీనిపై విజయవాడలోని మంతెన వైద్యాలయం నిర్వాహకులను సజగ్ టీమ్ సంప్రదించగా కీలక వివరాలు తెలిపారు.