తెలంగాణలో ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్‌ను అరెస్టు చేయటాన్ని చాలా మంది ఖండిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కక్ష పూరితంగా అల్లు అర్జున్‍ను అరెస్ట్ చేసిందని.. మూడు రోజులు జైలులో ఉంచాలనే శుక్రవారం రోజు అరెస్ట్ చేశారంటూ కీలక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే.. అరెస్టుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.