టీ తాగుదామని రైలు దిగి.. 20 ఏళ్లు వెట్టిచాకిరీ.. జీవితాన్ని తలకిందులు చేసిన ట్రైన్ జర్నీ..!

16 hours ago 1
రైలు ప్రయాణంలో ఓ వ్యక్తి చేసిన పని.. అతని జీవితాన్ని తలకిందులు చేసింది. టీ తాగేందుకు స్టేషన్‌లో రైలు దిగడం.. అతన్ని 20 ఏళ్లు వెట్టిచాకిరీ చేసేలా చేసింది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అప్పారావు 20 ఏళ్ల క్రితం పుదుచ్చేరి వెళ్తూ.. రైల్వేస్టేషన్‌లో టీ కోసం కిందకు దిగాడు. అయితే టీ తాగి ఎక్కేలోపు రైలు వెళ్లిపోవటం, చేతిలో డబ్బులు లేకపోవటం.. ఆ తర్వాత జరిగిన అనుకోని పరిణామాల్లో 20 ఏళ్లు వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చింది. చివరకు తమిళనాడు కార్మిక శాఖ అధికారుల సోదాలతో ఆ చాకిరీ నుంచి విముక్తి లభించింది.
Read Entire Article